TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతి నాకు వదిలేయండి: చంద్రబాబు

Published on: Wed Mar 21, 2012 2:09PM

కాంగ్రెస్ నాయకులు చిరంజీవి లోక్ సభకు ఎన్నిక కావడంతో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గంలో పోటీచేయాలని తహతహలాడుతున్న తెలుగు తమ్ముళ్ళకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తలంటుపోశారు. ప్రస్తుతం తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి 4 వేల సభ్యత్వాలు మాత్రమే ఉనాయని, ముందువీటిని 10 వేలకు పెంచాలని ఆయన టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహులకు టార్గెట్ పెట్టారు. చిరంజీవి ఇంకా రాజీనామా కూడా చేయలేదని, ఆయన రాజీనామా చేసిన తరువాత తిరుపతిలో టిక్కెట్ ఎవరికీ ఇవ్వాలో నిర్ణయిద్దామని ఆయన తనను కలిసిన చిత్తూరు జిల్లా నాయకులతో అన్నారు. అయితే ఒక నాయకుడు కాస్త చొరవ తీసుకుని ముందే అభ్యర్ధిని నిర్ణయిస్తే అతను ప్రచారం చేసుకునేవాడు కదా అని సూచించగా చంద్రబాబునాయుడు వెంటనే ఆ నేతకు క్లాస్ పీకారు. తిరుపతి టిక్కెట్ విషయం నాకు వదిలేయండి, ఆ సంగతి నేను చూసుకుంటాను. ముందు గెలిచే అభ్యర్థి ఎవరో నిర్ణయించుకోవాలి. ఆ విషయాన్ని నాకు వదిలిపెట్టండి. మీరంతా పార్టీని బలోపేతం చేయండి. సభ్యత్వాన్ని నమోదు 10 వేలకు పెంచండి అని కాస్త సీరియస్ గా అనడంతో తెలుగుతమ్ముళ్ళు మొహం మూడ్చుకోవలసి వచ్చింది.