TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెప్టెంబరు 18 నుంచి శాసన సభ సమావేశాలు : స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

Published on: Sat Aug 30, 2025 8:13PM

 

తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా శాసన సభ్యులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు సదస్సుకు హాజరు కానున్నట్టు చెప్పారు.

ఈ కార్యక్రమానికి తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోక్‌సభ స్పీకర్‌ ఓమ్ బిర్లా హాజరవుతారని, ముగింపు రోజున గవర్నర్‌ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారని  స్పీకర్‌  తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెప్టెంబరు 18 నుంచి శాసనసభ సమావేశాలు జరగుతాయని, ఈమేరకు ఎమ్మెల్యేలకు సమాచారం పంపించినట్టు తెలిపారు.