Latest News

శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 56లక్షలు

posted on: May 23, 2023 9:40AM

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ అధికంగా ఉంది. సోమవారం తిరుమల శ్రీవారిని 78వేల 349 మంది దర్శించుకున్నారు.

39వేల 634 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం నాలుగు కోట్ల 56 లక్షల రూపాయలు వచ్చింది.

ఇక మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...