TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు..

Published on: Wed Apr 27, 2016 2:05PM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ప్రధానాలయంపై నుంచి ఒక విమానం చక్కర్లు కొట్టింది. తిరుమలపై నుంచి విమానం వంటి ప్రయాణ సాధనాలు వెళ్లడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని టీటీడీ పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలు మార్లు ఇటువంటి ఘటనలు జరిగి భక్తులు, వేద పండితుల నుంచి విమర్శలు రావడంతో తిరుమలను నోఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా మరోసారి విమానం చక్కర్లు కొట్టడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.