TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sun Jun 29, 2025 8:49AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనం కోసం పోటెత్తుతున్నారు. ఆదివారం (జూన్ 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీనిండిపోయి క్యూలైన్ ఎన్జీ షెడ్డుల వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (జూన్ 28) శ్రీవారిని మొత్తం 90 వేల 051 మంది దర్శించుకున్నారు. వారిలో 39 వేల 58 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 90 లక్షల రూపాయలు వచ్చింది.