‘సుప్రీం’లో లడ్డూ కేసు రేపటికి వాయిదా!

posted on: Oct 3, 2024 4:13PM

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సుప్రీంకోర్టులో గురువారం జరగాల్సిన విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. సుప్రీం కోర్టు ధర్మాసనం మరో కేసులో బిజీగా వున్నందున లడ్డూ వివాదం కేసు విచారణ శుక్రవారం ఉదయం పదిన్నరనకు వాయిదా పడింది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే (సిట్) కొనసాగించాలా? లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటుచేయాలా? అనే అంశం మీద సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏ విషయాన్నీ గురువారం నాడు చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది.

తిరుమల స్వామివారం భక్తులు కోట్లాదిమంది మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ... మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలుచేసిన పిల్‌లపై బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...