కల్తీ నెయ్యిలో వ్యవహారంలో జగన్ పాత్ర ఉంది : డిప్యూటీ సీఎం
posted on: Feb 24, 2026 1:15PM
.webp)
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై శాసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ జరగలేదని వైసీపీ అబద్దాలు ఆడుతోందని మండిపడ్డారు. అధికారుల నివేదికల ఆధారంగానే తాము వాస్తవాలు వెల్లడిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఆలయాలపై దాడులు జరిగినప్పుడు కూడా బాధ్యతారాహితంగా వ్యవహరించిందని నిజాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. కల్తీ నెయ్యి దోషులకు శిక్ష పడాల్సిందేనని పవన్ అన్నారు.
టీటీడీ పాత బోర్డును వైసీపీ అధినేత జగన్ ఎందుకు వెనుకొస్తున్నారు అంటే ఆయనకు భాగం ఉన్నట్లే కదా అని డిప్యూటీ సీఎం అన్నారు. నెయ్యిలో ఏ రసాయనాలున్నాయే పేరుమాళ్లకే తెలియాలి..జంతు అవశేషాలు కలిశాయని ఎన్‌డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని పవన్ అన్నారు. పామాయిల్, కెమికల్స్ ఉన్నాయని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇది వేరే మతంలో జరిగి ఉంటే గగ్గోలు పెట్టేవారు అని డిప్యూటీ సీఎం తెలిపారు.



.webp)



