Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్రహ్మోత్సవాల ధ్వజారోహణకు ఇబ్బందేమీ లేదు!
posted on: Oct 4, 2024 3:48PM

శుక్రవారం సాయంత్రం తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా ధ్వజారోహణం జరగనుంది.ధ్వజస్తంభంపై గరుడ పఠాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించనున్నారు. ఈ ధ్వజారోహణ ఘట్టంతోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ ఘట్టానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తుండగా గరుడ పఠాన్ని ఎగురవేయాల్సిన ఇనుప కొక్కి విరిగిపోయినట్లుగా అర్చకులు గుర్తించారు. దీంతో ఆందోళన చెందిన అర్చకులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. ఈ చిన్న సంఘటన విషయంలో కొన్ని మీడియా సంస్థలు రాద్ధాంతం చేశాయి. ధ్వజారోహణే ఆగిపోతోందన్నట్టుగా కథనాలు వండి వడ్డించాయి. అయితే అలాంటి ప్రమాదమేమీ లేదని, ధ్వజారోహణ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని తెలుస్తోంది.






