తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అగ్నిప్రమాదం
Published on: Wed May 18, 2016 10:37AM
.jpg)
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి ఆలయం సమీపంలో నీళ్లు వేడి చేసే బాయిలర్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడ ఉండటంతో వారు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.


