TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో లక్షమంది భక్తులు

Published on: Sun Dec 20, 2015 11:03PM

 

శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడం కోసం లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్.లోని కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. అంతే కాకుండా నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కంపార్ట్.మెంట్లు కూడా భక్తులతో నిండిపోయాయి. అన్ని కంపార్టుమెంట్లూ నిండి రోడ్డు మీద రెండు కిలోమీటర్ల మేరకు భక్తులు క్యూ కట్టారు. అలాగే కాలి నడక మార్గం ద్వారా భారీ సంఖ్యలో గోవిందమాల భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ఏర్పాట్లు చేసింది.