తిరుమ‌ల‌కు పెరుగుతున్న ర‌ద్ధీ

 

స‌మైక్యాంద్ర ఉధ్యమం 24గంట‌ల పాటు సాక్షాత్తు తిర‌మ‌ల వెంక‌టేశ్వరున్నే అల్లాడించింది. సీమాంద్ర ఉద్యొగులు ఇచ్చిన సమ్మెపిలుపుతో తిరుమ‌ల తిరుప‌తిల‌లో జ‌న‌జీవ‌నం స్థంభించింది. క‌నీసం కొండ‌పైకి వెళ్లడానికి కూడా బ‌స్సులు లేక‌పోవ‌డంతో భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నిన్న రాత్రి నుంచి ఉద్యోగులు స‌మ్మె నుంచి తిరుమ‌ల కొండ పైకి వెళ్లే బ‌స్సుల‌కుస‌డ‌లింపును ఇవ్వటంతో ఆధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

దీంతో తిరుమలలో బుధవారం రద్దీ క్రమేణా పెరుగుతోంది. అలిపిరి నుంచి కొండకు ఆర్టీసీ బస్సుల రాకపోకలు సాగుతుండటంతో శ్రీవారి దర్శనానికి భక్తుల బారులు తీరారు. బుధ‌వారం కేవలం సొంత వాహనాలు, ట్యాక్సీలు, అద్దె జీపులు, ద్విచక్రవాహనాలు మాత్రమే ఠాట్ రోడ్‌లో తిరిగాయి. దీంతో రద్దీ అంతంతమాత్రంగా ఉంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు, అధికారులతో మంగళవారం రాత్రి టీటీడీ ఈవో, కలెక్టర్ తదితరులు జరిపిన చర్చలు ఫ‌లించాయి.య దీంతో నిన్న రాత్రి నుంచి 100 బ‌స్సులు కొండ పైకిన‌డుస్తున్నాయి.

అయిన ప్రస్థుతం న‌డుస్తున్న బ‌స్సులు స‌ర్వీసులు స‌రిపోక భ‌క్తులు ఘ‌ర్షణ‌ల‌కు దిగుతున్నారు. ప్రభుత్వం, టిటిడిలు చొర‌వ తీసుకుని తిరుమ‌ల తిరుప‌తికి స‌మ్మె నుంచిపూర్తి స్థాయి మిన‌హాయింపు కోరాల‌ని భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు.