TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది : భాను ప్రకాష్

Published on: Sun Jun 1, 2025 5:13PM

 

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శన క్యూలైన్లలో అది కూడా ఆలయం లోపల కొందరు వైసీపీ నేతలు కావాలనే భక్తులను రెచ్చగొడుతూతురని ఆయన అన్నారు. గోవులు చనిపోతున్నాయని ఓ అసత్య ప్రచారం చేశారుని ఆయన పేర్కొన్నారు. టీటీడీ ఆవరణంలో ముస్లిం వ్యక్తి వద్ద నమాజ్ చేయించి వారే వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయించారని ఆయన అన్నారు. వైసీపీ చేస్తున్న కుట్రలు బహిర్గతం చేసేలా విచారణ చేపట్టాలని ఏపీ డీజీపీకి లేఖ రాశామని భానుప్రకాశ్ తెలిపారు.రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదిర్కోలేకే…. శ్రీవారి భక్తుల మనోభావాలతో రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత.. రాజకీయ పునరావాస కేంద్రంగా వైసీపీ నేతలకు తిరుమల మారిందని అన్నారు. ఆలయ పవిత్రతో పాటు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా వారు వ్యవహిస్తున్నారని మండిపడ్డారు. 

మొన్న గోశాల నుంచి మొదలుకొని.. నిన్న గోవిందుడి వరకు వారు వరుసగా అరాచకాలకు పాల్పడతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి మళ్లీ పునరావృతం అయితే.. గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి మళ్లీ ఘటనలు పునరావృతం అయితే.. గట్టిగా బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చా శనివారం జరిగిన ఘటనపై రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తో పాటు ఇంటెలిజెన్స్ డీజీకి లేఖ రాశానని తెలిపారు. తాజాగా శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో ఉన్న కాకినాడకు చెందిన ఓ భక్తుడు.. టీటీడీ చైర్మన్, ఈవోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై టీటీడీ విచారణ జరిపింది. అందులోభాగంగా సదరు భక్తుడుని విచారించింది. ఈ సందర్భంగా టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. అంతేకాకుండా..టీటీడీని సదరు భక్తుడు క్షమాపణలు కోరాడు.