TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల క్యూ లైన్‌లో ఒకరినొకరు కొట్టుకున్న శ్రీవారి భక్తులు

Published on: Sun May 4, 2025 11:20AM

 

తిరుమలలో భక్తు రద్దీ కొనసాగుతుంది. సమ్మర్ హాలీడేస్ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. అయితే దర్శనానికి చాలా సమయం పడుతుండడంతో భక్తుల్లో అసహనం పెరుగుతోంది. ఒకేసారి క్యూలైన్లకు భక్తులను వదలడంతో ఒకరినొకరు తోచుకుంటున్నారు. అక్కడే ఉన్న విజిలెన్స్, పోలీస్ సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా భక్తులు ఒకరికి ఒకరు కొట్టుకున్నారు. శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ భక్తులకి ఎంత సర్ది చెప్పినా వినకుండా గొడవకు దిగిన వైనం వెంటనే క్యూలైన్ వద్దకి విజిలెన్స్ అధికారులు చేరుకొని భక్తుల్ని పక్కకు తీసుకెళ్లి  సముదాయించి గొడవ సద్దుమణిగేలా చేశారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని స్పష్టం చేసింది. 

అది ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ క్యూలైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్‌లో వెయిట్ చేస్తున్న వారికి 10 గంటలు సమయం పడుతోందని వెల్లడించింది. ప్రస్తుతం కొత్తగా క్యూలైన్‌లోకి వెళ్లే వారికి 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతాయని పేర్కొంది. శనివారం తిరుమల శ్రీవారిని 84 వేల 113 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,868 మంది తలనీలాలు  సమర్పించారు. హుండీ ఆదాయం  రూ.4.12 కోట్లు వచ్చింది. మొత్తం 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు సుమారు 15 గంటల సమయం పట్టింది. సమయం, స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు స్వామివారి సర్వదర్శనం 4 నుండి 6 గంటల పట్టింది. రూ. 300 ప్రత్యేక దర్శనం సుమారు 3 నుండి 4 గంటలు పట్టినట్లు తిరుమల అధికారులు తెలిపారు.