Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీవారి లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోంది : సోమిరెడ్డి
posted on: Nov 10, 2025 5:34PM

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వాస్తవాలను జీర్ణించుకోలేకే జగన్ మీడియాలో అడ్డగోలు రాతలు రాశరని సోమిరెడ్డి తెలిపారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడి ప్రసాదం పవిత్రతను భ్రష్టుపట్టించిన వారి పాపాలు పండుతున్నాయిని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో లీటర్ కు రూ.20 కమీషన్ తీసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేయించిన విషయం వాస్తవం కాదాని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఒక్క లీటర్ పాలు కొనుగోలు చేయని బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడం అవినీతిలో భాగమేని తెలిపారు. జగన్ రెడ్డికి హిందూ దేవుళ్లంటే నమ్మకం లేదు...వైవీ సుబ్బారెడ్డిదీ అదే పరిస్థితి అని వింటుంటామని తెలిపారు. ఈ క్రమంలోనే శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిపోయిందని..సీబీఐ విచారణతో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయిని సోమిరెడ్డి తెలిపారు.
వాస్తవాలను జీర్ణించుకోలేక లో రివర్స్ జగన్ మీడియాలో రాతలకు పనిపెట్టారని సోమిరెడ్డి విమర్శించారు. బ్యాంకు ఖాతాలు, లావాదేవీల వివరాలను సిట్ కోరితే వైవీ సుబ్బారెడ్డి కోర్టుకు ఎందుకెళ్లారు..కుట్రలు చేయకపోతే అంత భయమెందుకని సోమిరెడ్డి ప్రశ్నించారు. తిరుమల లడ్డూ అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను దెబ్బతీసిన వారు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి వస్తుందని వెల్లడించారు. ఏఆర్ డెయిరీకి అర్హత లేకపోయినా నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇవ్వడం కుంభకోణంలో భాగమేని మాజీ మంత్రి స్పష్టం చేశారు.
వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి తదితరులందరూ ధర్మారెడ్డి సహకారంతో వేల దర్శన టికెట్లు అడ్డగోలుగా పొంది సంతలా మార్చేశారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో అంతా నిజాయితీతో జరుగుతోంది...కోటాకు మించి ఒక్క లెటర్ ను అనుమతించే పరిస్థితి లేదని తెలిపారు. వెంకటేశ్వర స్వామికి అంకితమై బీఆర్ నాయుడు సేవలు అందిస్తున్నారు ..టీటీడీని అంకితభావంతో పనిచేసేలా తీర్చిదిద్దారని తెలిపారు. రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేయడం కోసం అప్పట్లో అలిపిరి ఘటనలో సీఎం చంద్రబాబుని వెంకటేశ్వరస్వామి బతికించారు..ఏడుకొండల వెంకన్న మహత్యానికి అదే నిదర్శనమని సోమిరెడ్డి తెలిపారు.






