Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎండాకాలం చిట్కాలు
posted on: Mar 1, 2021 9:30AM
A)ఎండాకాలం వచ్చిందంటే సహజంగా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అప్పుడు ఏం చెయ్యాలి, ఏమి లేదు. ఈ చిట్కాలు ప్రయత్నించండి. డీ హైద్రేషణ్ ను తగ్గించుకొండి.
1) చింతపండు పులుసులో నీరు కలిపి పచ్చిపులుసు లేదా చారు చేసుకుని తాగండి.
2 ) పచ్చి మామిడికాయను ఉడకబెట్టి పిసికి అందులో ఉప్పు చక్కెర , జీల కర్ర పొడి కలిపి చల్లార్చి తాగండి .
3) బెల్లం పానకం అంటే బెల్లాన్ని నీళ్ళలో కరిగించి ఇలాచి పొడి నిమ్మరం కలిపి తీసుకొండి. లేదా బెల్లం నీళ్ళలో కాస్త మిరియాల పొడి కలిపి తీసుకోండి శ్రీరామ నవమికి ఇచ్చే పానకం అదే.
b)ఎండాకాలంలో అందరు ఎదుర్కునే మరో సమస్య మూత్రంలో మంట. మూత్రంలో మంటగా ఉన్నప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు చిట్కా.
1) ధనియాలు ఒక చెంచా ఒక గ్లాసు నీళ్ళలో కలిపి బాగా మరిగించి వడబోసి అందులో కొంచెం పంచదార కలిపి తాగండి . దెబ్బకి మూత్రంలో మంట పారిపోతుంది. 2) మోదుగపూలు పది తీసుకుని 2 ౦ ౦ మిల్లీ లీటర్ల నీటిలో ఉడికించి వడబోసి అందులో కాస్త పంచదార కలిపి తీసుకొండి మూత్రంలో మంట కాస్త తగ్గుతుంది.
3) సతావరీ చూర్ణం ఒక చెంచా నీటిలో లేదా పాలతో తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది.
c) ఎండాకాలంలో వచ్చే నీరసం బలహీనత వస్తే ఏమి చేయాలి. ఎలాంటి చిట్కాలు పాటించాలి .ఒక వైపు నది నేతిన్న సూరీడు తింటే ఆయాసం తినక పోతే నీరసం దీని ఎలా అడిగ మించాలి అన్నది మరో సమస్య అందరిని వేదిస్తుంది.
1) అందరికీ తెలిసిన ఉసిరికాయ రసంలో, క్యాండీ చూర్ణాన్ని కలిపి తీసుకోవాలి పాటికబెల్లం తీసుకోవచ్చు. అలా చేస్తే వెంటనే నీరసం తగ్గిపోతుంది. ఉత్తి ఉసిరికాయను సైతం
తీసుకుంటే దాహం తాగించుకోవచ్చు. ఉప్పువేసిన నిమ్మరసం సైతం బాగా నీరాసాన్ని తగ్గిస్తుంది.
2) సహజంగా వేసవిలో మంచినీరు బాగా తాగుతారు అయితే ఎక్కడ దొరికిన నీళ్ళని తాగుతూ ఉంటారు. దానివల్ల నీళ్ళ విరోచనాలతో బాధపడడం చూస్తూ ఉంటాం దీని నుంచి బయటపడాలంటే నిర్లక్ష్యం చేస్తే డీహైడ్రేషన్ కు దారితీస్తుంది లేదా వడదెబ్బ తగిలినా చాలా నీరసంగా అయిపోతారు ఆవిషయాన్ని గమనించి మామూలు విరోచానానికి 1) మారేడు చూర్ణం బెల్లం తో కలిపి తీసుకోవాలి.
2 ) వట్టి వేర్లను ఒక గుడ్డలో చుట్టి నీటి కుండలో వేసి రోజూ ఆ నీటిని తాగితే వెంటనే విరోచనలు తగ్గుతాయి.






