Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నాణ్యమైన నిద్రకు ఆటంకం కలిగించే నాలుగు తప్పులు ఇవి ..!
posted on: Apr 16, 2025 9:30AM
.webp)
శరీరం, మెదడు తో పాటు మిగిలిన భాగాలకు నిద్ర అవసరమని చాలా మందికి తెలుసు. కానీ నిద్ర బరువును, ఆలోచనా శక్తి, రోగనిరోధక శక్తితో పాటు అనేక రకాల హార్మోన్లు మొదలైన వాటిని కూడా ప్రభావితం చేస్తుందని చాలా మందికి తెలియదు. తక్కువ నిద్రపోతే లేదా నాణ్యత లేని నిద్ర వస్తే, అది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వీటిలో మధుమేహం, ఊబకాయం, నిరాశ వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నాయి. నిద్రలేమికి అనేక కారణాలు ఉండవచ్చు. మంచి నిద్రకు ఆటంకం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుని అధిగమిస్తే.. నాణ్యమైన నిద్రను పొందడం సాధ్యమవుతుంది.
టీ, కాఫీలు తాగే సమయం..
భారతదేశంలో ప్రతి వీధిలో టీ ప్రియులు, కాఫీ ప్రియులు బోలెడు కనిపిస్తారు. ఇంట్లో కూడా రోజుకు కప్పుల కొద్ది కాఫీ, టీ తాగే వారు ఉంటారు. కానీ ఈ రెండు పానీయాల వినియోగ సమయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత కాఫీ, సాయంత్రం 5 గంటల తర్వాత టీ తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇది నిద్ర మీద చాలా దారుణ ప్రభావం చూపిస్తుందట.
మద్యం..
మద్యం తాగడం చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. మద్యం తాగడం వల్ల బాగా నిద్రపడుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ మద్యం తాగడం వల్ల త్వరగా నిద్ర వదిలిపోతుందట. నిద్ర నాణ్యత తగ్గిపోతుందట.
నిద్ర..
తరచుగా ఉదయం చాలా త్వరగా నిద్రలేవడం వల్ల మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో నిద్ర పోవడం కొందరి అలవాటు. దీని కారణంగా చాలా మంది 1 లేదా 1.5 గంటలు నిద్రపోతారు. కానీ ఇలా చేయడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రిపూట నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి మద్యాహ్నం పడుకుంటే కేవలం అరగంట లోపే ఈ సమయాన్ని పరిమితం చేయాలట.
7-9 గంటల నిద్ర..
నిద్ర అవసరం వయస్సు మీద ఆధారపడి ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి 7-9 గంటలు నిద్రపోవడం మంచిదట. 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే అది చిరాకును పెంచుతుందని అంటున్నారు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...






