పోలవరం ఏజెన్సీలో పులి సంచారం.. మళ్లీ అదే పులి

posted on: Feb 24, 2026 10:52AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను పులి భయం వదలడంలేదు. తాజాగా గత రెండు రోజులుగా పోలవరం  జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో  పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పులిని ఇటీవలే అటవీశాఖ అధికారులు పట్టుకుని పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టారు. అదే పులి అంతలోనే మళ్లీ జనావాసాలవైపుగా కదలడం ఆందోళనకు గురి చేస్తున్నది.

 ఈ పులి సంచారాన్ని   రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో  అటవీశాఖ అధికారులు గుర్తించారు.   కొద్ది రోజుల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పశువులపై దాడి చేసిన ఈ పులిని అటవీ అధికారులు ఈ నెల మొదటి వారంలో   బంధించి   పాపికొండలు అభయారణ్యంలో వదిలిన సంగతి తెలిసిందే.  అయితే అదే పులి మళ్లీ జనావాసాలవైపు కదలడంతో జనం భయంతో వణికి పోతున్నారు. ఇలా ఉండగా పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...