Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి జైలు!
posted on: Jan 23, 2025 1:01PM
.webp)
చెక్ బౌన్స్ కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు మూడు నెలలు జైలు శిక్ష విధించింది. మహేష్ చంద్ర మిశ్రా అను వ్యక్తి ఫిర్యాదు మేరకు 2018లో ఆయనపై ముంబైలో చెక్ బౌన్స్ కేసు నమోదైంది. ఈ కేసుపై అంధేరీ కోర్టులో విచారణ జరిగింది. దాదాపు ఏడేళ్ల తరువాత అంధేరీ కోర్టు ఈ కేసులో రామ్ గోపాల్ వర్మను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది.
గత ఏడేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసులో అంధేరీ కోర్టు ఇప్పటి వరకూ పలు మార్లు రామ్ గోపాల్ వర్మకు సమన్లు పంపింది. కోర్టుకు నేరుగా హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులూ ఇచ్చింది. అయితే వాటిని వేటినీ రామ్ గోపాల్ వర్మ ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలోనే కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
ఈ తీర్పు మేరకు ఆ తీర్పు మేరకు రామ్ గోపాల్ వర్మ మూడు నెలలు జైలు శిక్ష అనుభించాల్సి ఉంటుంది. అలాగే మూడు నెలలలోగా ఫిర్యాదు రాదు మహేష్ చంద్ర మిశ్రాకు 3 కోట్ల 72 లక్షల రూపాయలు చెల్లించాలని పేర్కొంది. అలా చెల్లించని పక్షంలో రామ్ గోపాల్ వర్మ మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.



.webp)


