Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
posted on: Jun 30, 2025 9:47AM
.webp)
అన్నమయ్య జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తిరుమల నుంచి కర్నాటకలోని బాగేపల్లి వెడుతున్న టెంపుల్ ట్రావెల్ ను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని కురబలకోట మండలం చెన్నామర్రిమిట్ట వద్ద జరిగింది.
దుర్ఘటన జరిగిన సమయంలో టెంపుల్ ట్రావెల్ లో డ్రైవర్ సహా 14 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మరో తొమ్మది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు. ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.


.webp)
.webp)


