TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హెచ్ సీఏ కేసులో ముగ్గురికి బెయిలు

Published on: Sat Jul 26, 2025 12:49PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీఏ కోశాధికారి శ్రీనివాస్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి రాజేంద్రయాదవ్ లకు బెయిలు లభించింది. అదలా ఉంచితే.. ఈ కేసులో అరెస్టైన హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహనరావును కస్టడీని పొడిగించాలంటూ   సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

ఇలా ఉండగా హెసీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈవో సునీల్ లు మల్కాజ్ గిరి కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిలు పిటిషన్లపై కోర్టు సోమవారం (జులై 28) విచారించే అవకాశం ఉంది. అదలా ఉంచితే హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, సీఈవో సునీల్, కోశాధికారి శ్రీనివాస్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు చెందిన కవిత, రాజేంద్రయాదవ్ లను వేర్వేరు కేసులలో పోలీసులు అరెస్టు చేశారు.  ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం తదితర అభియోగాలపై ఈ అరెస్టులు జరిగాయి. హెచ్ సీఏ జగన్ మోహనరావును అయితే ఫోర్జరీ ద్వారా 23 కోట్ల రూపాయలను దోచుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.  అలాగే సన్ రైజర్స్ యాజమాన్యాన్ని ఐపీఎల్ 2025 టికెట్ల కోసం బెదరించారన్న ఆరోపణలకు కూడా ఉన్నాయి.   అది పక్కన పెడితే ఈ కేసులో హెచ్ సీఏ ప్రధాన కార్యదర్శి దేవరాజ్ ను పోలీసులు పుణెలో అదుపులోనికి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో సీఐడీ ఇంత వరకూ ఆరుగురిని అరెస్టు చేయగా, వారిలో ముగ్గురికి బెయిలు లభించింది.