ఈ తాబేలు మహా రేర్ గురూ!

పిల్ల‌ల‌కు కుక్క‌, పిల్లి, కుందేళ్ల‌తో ఆడ‌టం అంటే మ‌హాస‌ర‌దా. చాలామంది కుక్క‌పిల్ల‌ల్ని పెంచుకోవ‌డం ఈ రోజుల్లో గొప్ప ఫ్యాష‌న్ గా మారింది. ఇప్పుడేమోగాని చాలాకాలం క్రితం బ‌డి సెల‌వ‌ల్లో జూ కి వెళ్లి అన్ని ర‌కాల జంతువుల‌ను ద‌గ్గ‌ర‌గా చూడ్డానికి పిల్ల‌లు ఎంతో ఆస‌క్తి చూపేవారు.

ఇప్పుడు  స్విట్జ‌ర్లాండ్ లోని ట్రొపిక్వారియ‌మ్ కి వెళ్ల‌డానికి తెగ ఇష్ట‌పడుతున్నారు చిన్నా, పెద్దా కూడా. ఎందుకంటే అక్క‌డ ఒక పెద్ద తాబేలును   జూ అధికారులు చూడ‌నిస్తున్నారు. పెద్ద తాబేలు చూడ్డానికి ఏముంటుంది? అనుకోకండి. దీనికీ ఓ క‌ధ వుంది. ఇది మామూలు తాబేలు కాదు. తాబేలు జాతిలో ఆల్బినో గ‌ల‌పాగోస్ అనే ర‌కం తాబేలు చాలా చాలా అరుద‌యిన‌ది. ఇప్ప‌టివారెవ‌రికీ ఇది తెలియ‌క‌పోవ‌చ్చు.

ప్ర‌స్తుతం జూలో వున్న ఈ తాబేలుకు మ‌రో బుజ్జి తాబేలు మే ఒక‌టో తేదీన పుట్టింది.  అది పుట్టిన‌పుడు దాని బ‌రువు కేవ‌లం 50 గ్రాములే! తెల్ల‌టి తోలు, ఎర్ర‌టి క‌ళ్ల‌తో అంద‌ర్నీ ఈ చిన్న తాబేలు ఆక‌ట్టుకుంటోంది. ఇలాంటివి ల‌క్ష‌ల్లో ఒక్క‌టే వుంటాయిట‌! అస‌లు ఇలాంటివి వుంట‌య‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కూ జంతు లోకం  గురించి తెలిసిన శాస్ర్త‌వేత్త‌లు కూడా చెప్ప‌లేదు. అందువ‌ల్ల ఇది మ‌హా రేర్ గురూ!

ఇంత బుజ్జిగా ఇపుడు క‌న‌ప‌డుతున్న‌ప్ప‌టికీ పెరిగే కొద్దీ వూహించ‌నంత పెద్దది అవుతుంది. ఈ బుజ్జిదాని త‌ల్లి బ‌రువు వంద కేజీలు. పెద్ద తాబేలు రెండు గుడ్లు పెట్టింది. మ‌నం ఫోటోలో చూస్తున్న దాని త‌ర్వాత మ‌రో బుజ్జిది మే ఐదో తేదీన పుట్టింది. అయితే దాని పై డిప్ప త‌న త‌ల్లికి లానే న‌ల్ల‌గా వుంటుంది. ఈ జాతి తాబేళ్ల జీవిత‌కాలం చాలా ఎక్కువే. ఇవి వంద సంవ‌త్స‌రా ల‌కు మించి బ‌తుకుతాయిట‌. అందిన స‌మాచారం మేర‌కు  సంర‌క్ష‌ణ‌లో పెట్టిన ఈ ర‌కం తాబేలు ఏకంగా 175 సంవ‌త్స రాలు బ‌తికింది.  అంత సుదీర్ఘ‌కాలం జీవించ‌గ‌ల‌గ‌డానికి ఓ ర‌హ‌స్యం వుంది. అదేమంటే,  డిఎన్ ఏ యొక్క శీఘ్ర మరమ్మత్తు మరియు క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా సహజ రక్షణను ప్రోత్సహించే జన్యు వైవిధ్యాలు వారి సుదీర్ఘ జీవితకాల రహస్యం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu