Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కెటీఆర్ మెడకు బిగుస్తోన్న ఫార్ములా ఈ రేస్ ఉచ్చు
posted on: Oct 25, 2024 11:21AM
ఫార్ములా ఈ రేస్ కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది . గత బిఆర్ ఎస్ ప్రభుత్వం ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు సేకరించింది . హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్ లో ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్రానికి ఒక్క రూపాయి ఆదాయమే రాకపోగా 55 కోట్ల రూపాయలను నిర్వహణ సంస్థకు ముట్ట జెప్పాల్సి వచ్చింది. ఈ కుంభకోణాన్ని వెలికి తీసింది ప్రస్తుత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఇది ట్రై పార్టీ అగ్రిమెంట్ అని ఆయన వెల్లడించారు. ట్రై పార్టీ అగ్రిమెంట్ అంటే రాష్ట్రానికి లాభం ఉండదు . కేవలం నిర్వాహకులకు మాత్రమే ఉంటుంది. అప్పట్లో అధికారంలో ఉన్న కెటీఆర్ ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ . తన బావమరిదికి చెందిన నిర్వహణ సంస్థకే ఫార్ములా ఈ రేస్ ప్రాజెక్ట్ అప్పగించారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేయడానికే ఈ ప్రాజెక్ట్ అని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంది. నిరుడు ఫిబ్రవరి 11న ఒక దఫా ఫార్ములా ఈ రేస్ జరిగింది. ఈ యేడు ఫిబ్రవరి లో నిర్వహించాల్సిన ఫార్ములా ఈ రేస్ రద్దయ్యింది . ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ ను తీవ్రంగా వ్యతిరేకించారు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం అప్పటి మున్సిపల్ మంత్రి కెటీఆర్ కనుసన్నల్లో జరిగింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించారు అరవింద్ కుమార్ ఆఘ మేఘాల మీద నిర్వహణ సంస్థకు 55 కోట్ల రూపాయలు ముట్టజెప్పారు . కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అరవింద్ కుమార్ కు మెమో ఇచ్చింది . కెటీఆర్ ఆదేశాలమేరకే 55 కోట్ల రూపాయలను ఈ ఫార్ములా రేస్ నిర్వహణ సంస్థకు బదిలీ చేసినట్లు అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అవినీతి నిరోధక శాఖ ను విచారణ జరపాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.






