తాజ్ కన్నా ముందున్న తిరుపతి

 

దేశంలోనే అత్యధిక మంది టూరిస్ట్ లను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ చరిత్ర స్రుష్టించింది.. మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలను వెనుకకు నెట్టి ఆంద్రప్రదేశ్ ఈ రికార్డును స్రుష్టించింది.గత సంవత్సరంలో దాదాపు 206.8 మిలియన్ల టూరిస్ట్ లు ఆంద్రప్రదేశ్ ను సందర్శించారు..అయితే ఆంద్రప్రదేశ్ ను సందర్శించిన వారిలో అధికంగా తిరుపతిని సందర్శించటానికే వచ్చారు.

 

ఆంద్రప్రదేశ్ తరువాత 184.1 మిలియన్ టూరిస్ట్ లతో తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉండగా,168.4 మిలియన్ టూరిస్ట్ లతో ఉత్తర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. అయితే అత్యధిక మంది టూరిస్ట్ లను ఆకర్షించిన మూడు ప్లేస్ లు ఆధ్యాత్మిక కేంద్రాలే కావటం విశేషం..

 

టూరిజం మినిస్టరీ హైయర్ అఫీషియల్స్ చెప్పిన లెక్కల ప్రకారం తాజ్ మహల్, ఎల్లోరా కేవ్స్ లాంటి పర్యాటక ప్రదేశాల కన్నా ఎక్కువ మంది టూరిస్ట్ లు ఆధ్యాత్మిక దామాలను చూడటానికి ఇష్టపడుతున్నారట.. విదేశి టూరిస్ట్ లు కూడా ఎక్కువగా ఇంలాటి స్ధలాలను చూడటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.. ప్రతి ఏటా ఆరు శాతానికి పైగా విదేశి టూరిస్ట్ ల సంఖ్య పెరుగుతుందని అంచనా..