Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ
posted on: Jan 17, 2025 8:37AM

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ జరిగింది. ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులకు పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణాదేవి ఫిర్యాదు చేశారు. సంక్రాంతి పండుగకు కుటుంబ సమేతంగా ఊరు వెళ్లారు.
తిరిగి వచ్చిన అనంతరం తమ ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించామనీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ నివాసం నుంచి లక్షన్నర నగదు, పెద్ద మొత్తంలో ఆభరణాలూ చోరీకి గురయ్యాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


.webp)



