Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అసలు పొటాషియం శరీరానికి ఎందుకు అంత ముఖ్యం తెలుసా?
posted on: Feb 21, 2025 9:30AM

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో పొటాషియం కూడా ఒకటి. ఇది శరీరంలో చాలా రకాల పనులు జరగడానికి అవసరం. కానీ చాలామందికి పొటాషియం గురించి అవగాహన లేదు. అసలు పొటాషియం శరీరానికి ఎందుకు అవసరం. ఇది శరీరంలో నిర్వహించే పనులు ఏంటి? ఏ ఆహారాలు తీసుకుంటే పొటాషియం శరీరానికి పుష్కలంగా లభిస్తుంది. వివరంగా తెలుసుకుంటే..
పొటాషియం శరీరానికి అవసరమైన ఖనిజాలలో ప్రముఖమైనది. ఇది గుండె, కండరాలు, నాడీ వ్యవస్థ, మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యం. శరీరానికి తగినంత పొటాషియం అందుతూ ఉంటేనే పై అవయవాలు ఆరోగ్యంగా తమ విధులు అవి సమర్థవంతంగా నిర్వహిస్తాయి. కానీ పొటాషియం లోపిస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి.
పొటాషియం లోపం వల్ల బలహీనత, కండరాల తిమ్మిరి, రక్తపోటు.. వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు రాకూడదు అంటే సమతుల ఆహారంలో పొటాషియం సమృద్దిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే శరీరం శక్తివంతంగా ఉంటుంది.
పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు, కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధ సమస్యలు ఉంటే ఆ కుటుంబ సభ్యులు గుండె ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి.
శరీరానికి పొటాషియం ఎందుకు ముఖ్యం అంటే.. ఇది శరీరంలో కాల్షియం తగిన మోతాదులో ఉండేలా చేస్తుంది. ఎముకల బలానికి పొటాషియం తీసుకోవడం కూడా చాలా అవసరం.
అంతేకాదు.. పొటాషియం శరీరానికి సరిపడినంత తీసుకోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగు పడుతుంది. తద్వారా స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది. అంటే.. మెదడు సంబంధ సమస్యలు రావద్దని అనుకుంటే పొటాషియం గల ఆహారాన్ని బాగా తీసుకోవాలి.
పొటాషియం బాగా తీసుకోవాలి అని అనిపించినా పొటాషియం ఎందులో ఎక్కువ ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వారు పొటాషియం రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకోవాలి. బంగాళదుంపలు, పాలకూర, అవకాడో, నారింజ వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల పొటాషియం బాగా లభిస్తుంది.
*రూపశ్రీ.






