శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం..

శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం..

రోజువారి ఆహారంలో ఇవి ఉన్నాయా..

ప్రతి రోజూ మన ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదార్థాలు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా క్యారెట్, బచ్చలి, తులసి, పాలకూర, నిమ్మకాయ, కోడిగుడ్లు మొదలైనవి.

- ప్రతి ఇంట్లో తులసి తప్పనిసరిగా ఉండాలని మన పెద్దలు అంటారు పూజించడానికి కాదు ఆరోగ్యానికి తులసి ఆకులు ఎంతో మంచివి. రోజూ నాలుగు తులసి ఆకులు నమలడం వలన శరీరంలోని సూక్ష్మక్రిములు చనిపోతాయి ఎన్నో వ్యాధి కారకాలను తులసి నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ రోజు ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల కూడా శరీరానికి కావలసిన శక్తి వస్తుంది.

- మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే రోజు ఉదయాన్నే మీ రోజుని గ్రీన్ టీతో ప్రారంభించండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్  మీలో రోగ నిరోధక శక్తి పెంచడానికి ఎంతో సహాయపడుతుంది గ్రీన్ టీ తాగడం వలన శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరగడం కాకుండా శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. 

- మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. వీటిలో ముఖ్యంగా బచ్చలి, పాలకూర. రోజూ ఆహారంలో ఆకుకూరలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. ఆకుకూరల్లో బచ్చలి కూరది విశిష్ట స్థానం. ఇందులో విటమిన్ సి తోపాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది.

- పాలకూర విటమిన్ సి ,బి 6 తో పాటు విటమిన్ కె ఇందులో అధికంగా ఉంటుంది క్యారెట్ ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్ జ్యూస్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ బి 6 యాంటీఆక్సిడెంట్లు ఉత్తేజపరుస్తాయి క్యారెట్ టమాటతో కలిపి తాగితే క్యాన్సర్ ను నివారించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

- ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం పెరుగులో అనేక పోషక విలువలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేసే పెరుగును రాత్రి సమయాల్లో కాకుండా పగటి పూట అన్నంలో తీసుకోవడం మంచిది. వ్యాధినిరోధక శక్తిని పెంచే పెరుగు తీసుకోవడం ద్వారా ఎముకలు, దంతాలు పటిష్టమవుతాయి. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఈ పెరుగు రక్తపోటును నియంత్రిస్తుంది.

-  ప్రతిరోజూ గుడ్డు తీసుకోవడం మరిచిపోవద్దు.గుడ్డు లోని ప్రోటీన్, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి రోజూ ఒక కోడి గుడ్డు తినడం ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్లు, పోషకాలు అందుతాయి.

- శరీరం కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్లు తిరిగి ఏర్పడ్డానికి జింక్ బాగా తోడ్పడుతుంది శరీరానికి కావాల్సిన జింక్ ఎక్కువగా కోడిగుడ్డు మాంసంతో పాటు సీఫుడ్ లో లభిస్తుంది వారానికి రెండుసార్లు తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన జింక్ విటమిన్-డి లభిస్తాయి వీటివలన శరీరం యొక్క రోగనిరోధక శక్తి తిరిగి ఏర్పడుతుంది.

- ఎర్ర బియ్యం లోనూ అధిక యాంటీఆక్సిడెంట్స్ కంటెంట్ ఉంది రోగనిరోధకశక్తిని పెంచడానికి పళ్ళు కూరగాయలు మసాలా దినుసులతో పాటు ఎర్ర బియ్యం కూడా ఎంతో ఉపయోగపడతాయి.‌

వీటన్నింటితో పాటు ప్రతిరోజు మంచినీళ్లు ఎక్కువగా తాగడం ఎంతో అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.