Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కళ్యాణ మండపం నుండే బాయ్ ఫ్రెండ్ తో పరారైన పెళ్లికూతురు
posted on: Oct 25, 2024 1:39PM
మరో ఐదు గంటల్లో పెళ్ళి...పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో సంప్రదాయబద్దంగా వేడుకలు జరుగుతున్నాయి. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి కూతురు కాస్త ఒకరికి భార్య కాబోతుంది. ఏడు అడుగులు, మూడు ముళ్లు వేస్ట్ అనుకుంది. ఆ పెళ్లి కూతురు. నచ్చిన అబ్బాయికి కాల్ చేసింది. నన్ను తీసుకెళ్లమని వేడుకుంది. బాయ్ ఫ్రెండ్ రానే వచ్చాడు . తీసుకెళ్లిపోయాడు. ఇదంతా సిసి ఫుటేజిలో రికార్డయ్యింది.
అనంతపురంకి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడు విశ్వాసికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి, రాత్రి సంప్రదాయాల ప్రకారం చిన్నతంబులం,పెద్ద తాంబూలం కూడా చేశారు. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో నాలుగు గంటలకు గోపాల్ ప్లాజా కళ్యాణ మండపం నుండి వెళ్లిపోయింది. కొన్ని గంటలలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి నిలిచిపోవడంతో పెళ్లి కుమార్తె తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు కళ్యాణ మండపం నుండి ఒక అబ్బాయితో వెళ్ళిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. జరగాల్సిన పెళ్లి ఒక్కసారిగా నిలిచిపోవడంతో అటు పెళ్లికూతురు ,ఇటు పెళ్లి కుమారుడు బంధువులు నిరుత్సాహంగా ఉండిపోయారు.


.webp)
.webp)


