అజిత్ పవార్ చివరి కోరిక అదే.. కానీ
posted on: Jan 31, 2026 11:22AM
.webp)
ఇటీవల విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చివరి కోరిక ఎన్సీపీ గ్రూపులు రెండూ విలీనం కావడమేనని శరద్ పవార్ అన్నారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు జరిగాయన్న ఆయన విలీనానికి ఫిబ్రవరి 12 ముహూర్తం కూడా ఖరారైందన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన విలీనం దిశగా అడుగులు పడుతుండగానే.. దురదృష్టవశాత్తూ అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
అజిత్ పవార్ మృతితో విలీనానికి బ్రేక్ పడిందన్నారు. ఇక పోతే అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా శనివారం (జనవరి 31) ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న సంగతి తనకు తెలియదన్న శరద్ పవార్, అసలు ఎన్సీపీ (అజిత్ పవార్)లో ఏం జరుగుతోందన్న విషయం తనకు తెలియదన్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా చేరుతున్నట్లు తమ కుటుంబానికి సమాచారం లేదని చెప్పారు. ఎన్సీపీ రెండు గ్రూపుల విలీనంపై గత నాలుగు నెలలుగా అజిత్ పవార్, శశికాంత్ షిండే, జయంత్ పాటిల్ చర్చలు జరిపారని అజిత్ పవార్ అన్నారు.




.webp)





