Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీ వాట్సప్ గ్రూపులో టెన్త్ క్వశ్చన్ పేపర్.. ఏపీలో కలకలం
posted on: Apr 29, 2022 12:58PM
ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రహసనంగా మారుతున్నాయి. వరుసపెట్టి ప్రతీరోజు ఏదో ఒక చోట క్వశ్చన్ పేపర్ లీక్ అవుతూనే ఉంది. అన్ని విమర్శలు వస్తున్నా.. స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. అవి పేపర్ లీక్‌లు కాదంటూ కవర్ చేసుకుంటోంది విద్యాశాఖ. ఇక ఆ శాఖ మంత్రి ఇప్పటి వరకూ పత్తా లేకుండా పోయారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్. వరుసగా మూడు రోజులు మూడు సబ్జెక్ట్‌ల పరీక్ష పేపర్లు బయటకు వచ్చాయి. తాజాగా, ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఏకంగా వైసీపీ వాట్సప్ గ్రూపులో ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ లీకేజీల వెనుక ఉన్నది అధికారపార్టీ నేతలేననే అనుమానం మరింత బలపడుతోంది.
శ్రీసత్యసాయి జిల్లాలోని ఆమడగూరు మండల కేంద్రంలోని ఓ పరీక్షా కేంద్రం నుంచి 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్ కలకలం రేపుతోంది. ఉదయం 11 గంటల నుంచి వైసీపీ వాట్సాప్ గ్రూపులో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టింది. పరీక్ష ప్రారంభమైన 8 నిమిషాలకే.. వైసీపీ గ్రూప్‌లో క్వశ్చన్ పేపర్‌ను కొందరు షేర్ చేశారు.
పదో తరగతి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లీక్‌కు సంబంధించి.. ప్రభుత్వ హైస్కూల్ అటెండర్‌పై విద్యాశాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. వైసీపీ నేతలతో కుమ్మకై క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టు తెలుస్తోంది.






