Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎకానమీ సృష్టికి చిరునామా తెలుగుజాతి.. చంద్రబాబు
posted on: May 19, 2025 7:49AM
.webp)
ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగుజాతి ఉంటుందని, నాలెడ్జ్ ఎకానమీ, ఆంట్రప్రెన్యూర్‌లో తెలుగు ప్రజలు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కంఠంనేని రవిశంకర్ తెలుగువన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం (మే 18) పాల్గొన్నారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు
తెలుగువన్ డిజిటల్ మీడియా ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమై నేడు 400 ఛానల్స్‌తో ప్రతి దేశంలో ఉందంటే అందదుకు రవిశంకర్ కృషి, పట్టుదలే కారణమన్న చంద్రబాబు.. తాను విజన్ రూపొందిస్తే దానికి సమానంగా ఆయన కూడా ఛానల్ అభివృద్ధిలో విజన్ రూపొందించుకుని ముందుకెళ్తున్నారన్నారు. ఒకప్పుడు ఆకాశవాణి తప్ప ఏమీ ఉండేవి కాదు. తర్వాత వార్తా పత్రికలు వచ్చాయి. తర్వాత సమాజంలోకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. రవిశంకర్ లాంటి వ్యక్తులు అనేక ఛానల్స్ తీసుకొచ్చారు. తెలుగు వన్ ఛానల్ కు ప్రస్తుతం వరకు 55 బిలియన్ వ్యూవ్స్, 120 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 16 లక్షల వీడియాలు, 15 వందలకు పైగా సినిమాలతో తెలుగువన్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని చంద్రబాబు అన్నారు. కంఠంనేని రవిశంకర్ నిర్మించిన అమరావతి సినిమాపైనా చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఆ నాడు భయపెట్టే పరిస్థితులు ఉన్నా.. అమరావతికి అన్యాయం జరిగిందన్న కోపంతో, ఆవేదనతో ధర్మం, న్యాయం కోసం నిలబడి అత్యంత సాహసంతో రాజధాని ఫైల్స్ సినిమాతీసిన ధీరోదాత్తుడు రవిశంకర్ అని చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.

సామాజిక బాధ్యత విషయంలోనూ రవిశంకర్ ముందుంటారన్న చంద్రబాబు ఇప్పటి వరకూ కంఠంనేని 2000 మంది పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారని అందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలకు కూడా చంద్రబాబు అభినందనలు తెలిపారు. తాను అరెస్టైన సమయంలో హైదరాబాద్‌లో మీరు పోరాడిన విధానం తన జీవితంలో మర్చిపోలేనన్నారు. గచ్చిబౌలిలో సీబీఎన్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ను ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు మనం మంచిపని చేస్తే ప్రజలు మర్చిపోతారు అని అంటుంటారు..కానీ ఏ విధంగా ప్రజలు స్పందింస్తారనేది ఆ సభ కళ్లకుకట్టిందన్నారు.
సోషల్ మీడియాపై నియంత్రణ ఉండాలన్న రవిశంకర్ సూచనను చంద్రబాబు స్వాగతించారు. సామాజిక మాధ్యమంతో ఎంత లాభం ఉందో..అంతనష్టం ఉంది. సోషల్ మీడియాను వేదికగా తీసుకని వ్యక్తిత్వ హననం, తప్పుడు సమాచారానికి పాల్పడుతున్నారు. దీనిపై నియంత్రణ అవసరం. ఇళ్లలో ఉండే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేస్తే సమాజానికి హాని కలుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిష్పక్షపాత మీడియాను ప్రోత్సహించే అంశంపై ఆలోచిస్తాయి. దుర్మార్గపు ఆలోచన చేసే వారిని నియంత్రించాల్సి ఉంది అన్నారు.
.webp)






