Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ అధికారిక చిహ్నాల ప్రకటన
posted on: Nov 17, 2014 1:34PM

తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట (ఇండియన్ రోలర్), రాష్ట్ర పుష్పంగా తంగేడు, జంతువుగా జింక, చెట్టుగా జమ్మి చెట్టును ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఆంధ్రుల దృక్కోణంలో రాష్ట్ర అధికార చిహ్నాలను విడుదల చేశారని, ఇప్పుడు తెలంగాణ దృక్కోణంలో వీటిని ఎంపిక చేశామని ఆ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జంతువుగా వృషభాన్ని ఎంపిక చేయనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. శక్తికి, పౌరుషానికి ప్రతీకగా వుండే వృషభం అయితే బాగుంటుందన్న అభిప్రాయాలు గతంలో వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా జింకను తెలంగాణ రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు.






