రాష్ట్ర ప్రక్రియ ఐదారు నెలల్లో పూర్తి: షిండే

 

Telangana state in six months, Telangana state shinde, Shinde Telangana

 

 

రాష్ట్ర విభజన ప్రక్రియకు సాధారణంగా ఎనిమిది నెలలు పడుతుందని, కాని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ఐదారు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నోట్‌ను రాష్ట్రపతికి పంపడం జరుగుతుందని షిండే చెప్పారు.

 

హోంమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరిందని, ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. దేశంలో చాలా చోట్ల ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లు వస్తున్నాయని, అయితే విధర్భ కంటే ముందే తెలంగాణ డిమాండ్ ఉందని షిండే పేర్కొన్నారు.



కేబినెట్‌లో తెలంగాణ అంశంపై నోట్ సిద్ధం కాగానే హైదరాబాద్‌పై మరింత స్పష్టత వస్తుందని షిండే స్పష్టం చేశారు. భాష ఆధారంగానే రాష్ట్రం ఉండాలని ఎక్కడా లేదని, రాష్ట్ర విభజనపై అందరూ సయంమనం పాటించాలని షిండే విజ్ఞప్తి చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu