వాళ్లవి ఉత్తర కుమార ప్రగల్బాలేనా

 

telangana state, andhra ministers telangana state, congress ministers telangana

 

 

ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతాం అలా జరగని పక్షంలో తన పదవులకు పార్టీకి రాజీనామ చేస్తామంటూ ఉత్తర కుమార ప్రగల్బాలు పలికిన నాయకులు ఇప్పుడు మొహం చాటేశారు. ప్రకటనకు ముందు వరకు రాజీనామాల డ్రామా ఆడిన ఈ నాయకులు తెలంగాణ ప్రకటన తరువాత మీడియాకు కనిపించటమే మానేశారు.

 

అయితే ఈవిషయం పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో సమావేశం అయిన మంత్రులు భిన్న వాధనలు వినిపించారు.. కొంత మంది రాజీనామాలకు మొగ్గు చూపగా మరి కొందరు మాత్రం అధిష్టాన నిర్ణయమే శిరోదార్యం అంటున్నారు. ఆఖరికి ముగ్గురు మంత్రులు మాత్రమే రాజీనామలు అందించగా మిగతా వారు అధిష్టానానికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు.



అదే సమయంలో అధిష్టానం దూతలుగా వచ్చిన ఏఐసీసీ కార్యదర్శులు తిరునావుక్కరసు, కుంతియా వారిని కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీమాంధ్రలో ఆందోళనలు తీవ్రతరమవుతున్నందున ప్రజల్లోకి వెళ్లాలంటే రాజీనామాలు తప్పవని మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, శైలజానాథ్, కాసు కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.