తెలంగాణ స్పీకర్ కు అస్వస్థత

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి వడదెబ్బతో పాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేసీఆర్ స్పీకర్ ను పరామర్శించారు. అంతేకాక నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ ను స్పీకర్ గురించి వివరాలు అడిగి తెలుసుకొని ఆయనకు మెరుగైన వైద్యం అందించమని కూడా సూచించారు. సీఎంతో పాటు శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పీకర్ ను పరామర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu