సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ

posted on: Aug 6, 2013 3:50PM

 

 telangana seemandhra, telangana state, united andhra pradesh

 

 

హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో ఉన్న జలసౌధ నీటి పారుదల కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగులు..సీమాంధ్ర ఉద్యోగుల మధ్య తోపులాట జరగడంతో..అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బోజన విరామ సమయంలో టీ ఎన్‌జీవో ఉద్యోగులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఏపీ ఎన్‌జీవో ఉద్యోగులు విభజనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రామాన్ని చేపట్టారు.


ఏపీ ఎన్‌జీవో ఉద్యోగులు సమైక్య నినాదాలు చేయగా..వారికి పోటిగా టీ ఎన్‌జీవో ఉద్యోగులు తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వివాదం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి నచ్చజెప్పి ఇరు ప్రాంతాల ఉద్యోగులను శాంతింపజేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...