TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ శకుంతలకు తుది వీడ్కోలు

Published on: Sun Jun 15, 2014 3:46PM

 

గుండెపోటుతో మృతిచెందిన ప్రముఖ సినీ నటి తెలంగాణ శకుంతలకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నివాళులర్పించింది. శకుంతల భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం కొంపల్లిలోని ఆమె నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. సినీ నిర్మాత డి. రామానాయుడు సహా గద్దర్, వేణుమాధవ్, హేమ, ఝాన్సీ, పలువురు ప్రముఖులు ఆమె భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర జరిపి ఆల్వాల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహించారు. శకుంతల ఆకస్మిక మృతిపట్ల పలువురు సినీప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.