తెలంగాణలో 7139 వరి కొనుగోలు కేంద్రాలు!
Published on: Fri Oct 4, 2024 12:20PM

తెలంగాణ వ్యాప్తంగా 7139 వరి పంట కొనుగోలు కేంద్రాలను ఒకటీ రెండు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వరి సాగు ముందుగా పూర్తయిన నిజామాబాదు, నల్గొండ జిల్లాల్లో ముందుగా కేంద్రాలను ప్రారంభించనున్నారు. 88.09 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 48.91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు.


