Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడిగింపు
posted on: Feb 25, 2026 8:37PM

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియా అకాడమీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కె. శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, 2024, ఫిబ్రవరి 26న రెండేళ్ల కాలానికి గాను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కె. శ్రీనివాస్ రెడ్డి రెండేళ్లకు నియమితులయ్యారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్న విశేష కృషిని ప్రభుత్వం గుర్తించి ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, ఆయన మరో రెండేళ్ల పాటు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కొనసాగనున్నారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మరియు ఇతర సంక్షేమ పథకాల అమలులో శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించనున్నారు.






