మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ
posted on: Feb 22, 2026 10:17AM

తెలంగాణలో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కేంద్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అగ్రనేత దేవ్‌జీ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపో నున్నట్లు విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చింది. కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న దేవ్‌జీ లొంగుబాటు మావో యిస్టు పార్టీలో పెద్ద పరిణామంగా భావిస్తు న్నారు. అంతేకాకుండా దేవ్‌జీతో పాటు మరో కీలక నేత మల్లా రాజిరెడ్డి కూడా పోలీసుల ముందు లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ పార్టీ కార్యకలాపాల్లో దీర్ఘకాలంగా కీలక పాత్ర పోషించిన నాయకులుగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా కేంద్ర స్థాయి వ్యూహాత్మక నిర్ణయాల్లో దేవ్‌జీ పాత్ర ఉండటంతో, ఆయన లొంగుబాటు మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బగా మారనుంది.
ఇటీవల భద్రతా బలగాల ఒత్తిడి, అడవుల్లో మారిన పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, పునరావాస విధానాలు ప్రభావం చూపడంతో పలువురు మావోయిస్టు నేతలు ప్రధాన ప్రవాహంలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని పోలీసు వర్గాలు చెబుతు న్నాయి. అదే దిశగా ఈ లొంగుబాట్లు కూడా జరుగు తున్నట్లు సమాచారం. లొంగుబాటు అనంతరం ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకాలు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయుధాలను వదిలి సామాజిక జీవితం లోకి రావాలని రాష్ట్ర పోలీసులు మరోసారి మావోయిస్టులకు పిలుపు నిస్తున్నారు. ఈ లొంగుబాటు నేపథ్యంలో మావోయిస్టు కార్యకలాపాలపై మరింత ప్రభావం పడే అవకాశ ముందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.



.webp)



