Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ మునిసిపోల్ బరిలో తెలంగాణ జాగృతి
posted on: Jan 20, 2026 11:29AM

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మునిసిపోల్ బరిలో తెలంగాణ జాగృతి అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా నిజామాబాద్ మునిసిపల్ బరిలో స్పష్టమైన ప్రభావం చూపే దిశగా అధిక సంఖ్యలో వార్డు సభ్యులను బరిలోకి దింపాలని నిర్ణయించారు.
సోమవారం (జనవరి 20) హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి కీలక నేతలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ మునిసిపోల్స్ లొ కనీసం 30 వార్డులలో తెలంగాణ జాగృతి అభ్యర్థులను పోటీలో నిలపాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అభ్యర్థుల ఎంపికను మునిసిపోల్స్ కు నోటిఫికేషన్ వెలువడడానికి ముందే ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మునిసిపోల్స్ లో ఉనికిని బలంగా చాటడం ద్వారా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని కవిత భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.






