అక్టోబర్ లో తెలంగాణ!

posted on: Jul 22, 2013 4:15PM

 

Telangana issue, Palvayi on Telangana, Telangana  issue

 

 

కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణపై జోస్యం చెబుతున్నారు. అక్టోబర్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని ఆయన చెప్పారు. ఈసారి తెలంగాణ పక్కా అని ఆయన నొక్కి వక్కాణించారు. భాజపా, తెదేపా, తెరాస నాయకులు తెలంగాణ రాదని ప్రచారం చేయడం సరికాదన్నారు. తెరాసపై, కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూనే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని కేసీఆర్ గతంలో ప్రకటించారని, ఆ మాటకు కేసీఆర్ కట్టుబడి.. తెలంగాణ రాగానే తెరాసను కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయాలన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్లిన ఒక నక్షత్రకుడు ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపిస్తారోననే ఆందోళన తమకు ఉందంటూ కె.కేశవరావుపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వడానికే తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...