రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
posted on: Jun 16, 2025 6:08PM
.webp)
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,034 రైతు వేదికల్లో రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభమైంది. ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షాకాల పంటలకు పెట్టుబడి కోసం రేపటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ డబ్బులు వేయనున్నాట్లు తెలుస్తోంది. కాగా ఈ పథకం కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున ఏటా రెండు సార్లు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది



.webp)


