తెలంగాణ ఎంసెట్​ ఫలితాలు విడుదల

posted on: May 25, 2023 10:36AM

 తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం (మే 25)ఉదయం ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.  

ఈ నెల 10 నుంచి 14 వరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో ఎంసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 3 లక్షలకు పైగా విద్యార్థులు ఎంసెట్‌ పరీక్షకు హాజరయ్యారు.

 కాగా అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం, ఇంజినీరింగ్‌ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో బాలుర ఉత్తీర్ణతా శాతం 79 కాగా బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక  అగ్రికల్చర్ విభాగంలో బాలుర ఉత్తీర్ణతా శాతం 84 కాగా బాలికల ఉత్తీర్ణతా శాతం 87. ఇక త్వరలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...