Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ కాంగ్రెస్ నుండి మరో రెండు వికెట్లు డౌన్.. వివక్ష చూపుతున్నారు..
posted on: Apr 25, 2016 11:42AM

ఏపీలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వలసల పర్వం సాగుతోంది. అటు ఆంధ్రాలో ప్రతిపక్ష పార్టీ నుండి టీడీపీలోకి జంప్ అవుతుంటే.. ఇక్కడ తెలంగాణలోకూడా ప్రతిపక్ష పార్టీనుండి అధికారపార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నుండి పలువురు టీఆర్ఎస్ లోకి చేరగా మరో రెండు వికెట్లు పడనున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆయనతోపాటు మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫారూక్‌హుసేన్ కూడా సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. అజయ్‌తో కలిపి కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు కారెక్కడంతో శాసనసభలో కాంగ్రెస్ బలం 13కు పడిపోనుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు తనపట్ల వివక్ష చూపారని, అందువల్లే ఆ పార్టీని వీడుతున్నానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే తెరాసలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.






