వాళ్ళ మాట...ప్రజల తూటా

వాళ్ళ మాట...ప్రజల తూటా

 

 

 

వాళ్ళ మాట

 

1. అన్ని పార్టీల అధినేతల అంగీకారంతోనే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాం. 

 

ప్రజల తూటా

 

1.అధినేతలు అరడజను మంది... ప్రజలు ఆరు కోట్లు మంది...ఎవరి    అభిప్రాయం ముఖ్యం.

వాళ్ళ మాట

 

2. గీ ఉద్యమాలన్నీ పక్కన బెట్టి అన్న దమ్ములేక్క ఇడిపోదాం. 

 

ప్రజల తూటా

 

2. అవును...నువ్వు నీ వాటాగా బంగాళా తీస్కో...మేము మా వాటాగా గుడిసె తీస్కుని అన్నదమ్ముల్లా విడిపోదాం.

వాళ్ళ మాట

 

3. హైదరాబాద్ కెల్లి మేం పోమ్మనట్లే..ఈడనే మీరూ ఉండండి..మేమేం అనం

 

ప్రజల తూటా

 

3. దానికి ప్రత్యేక రాష్ట్రం అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్నట్టే  ఉండొచ్చు.

 

వాళ్ళ మాట

4. డిగ్గీ సింగ్..పదేళ్ళు హైదరాబాద్ మీద పెత్తనం తెలంగాణ వాళ్ళదే! 

 

ప్రజల తూటా

 

4. సీమాంధ్రవాళ్లకి అన్యాయం జరగదన్నావ్..ఇదా?

 

వాళ్ళ మాట

5. విగ్రహాలు ధ్వంసం మంచి పద్దతికాదు. 

 

ప్రజల తూటా

 

5. అవును..అది..నిజమే.....ఆవిషయం ఈ రోజు తెలిసిందే? హైదరాబాద్ లోని  ట్యాంక్ బండ్ మీద మహామహుల విగ్రహాలు కూల్చినప్పుడు ఈ మాట ఎందుకనలేదు.

 

వాళ్ళ మాట

6. డిగ్గీ సింగ్..ఈ సమ్మెలు ఉద్యమాలు చెయ్యడం మాములే. 

 

ప్రజల తూటా

 

6. అలాగే అనుకుని ప్రత్యేక రాష్ట్రం జోలికి వెళ్ళకుండా ఉండాల్సింది.

 

వాళ్ళ మాట

7. చిరంజీవి.. నేను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటాను.

 

ప్రజల తూటా

 

7. ఇప్పుడు కట్టిపడేసినట్లు మాట్లాడాకుండా కూర్చున్నాడు. 

 

 వాళ్ళ మాట                       

8. చంద్రబాబు...సెపరేట్ రాజధాని నిర్మించుకోవడానికి నేను 5 లక్షల కోట్లు కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.

 

ప్రజల తూటా

 

8. ఈయన డిమాండ్ చేస్తే ఇవ్వడానికి అక్కడి వాళ్ళు రెడీగా ఉన్నారు.

 

 వాళ్ళ మాట         

9. మీరు ఆడ మరో రాజధాని మంచిగా డెవలప్ చేస్కోవచ్చు.

 

ప్రజల తూటా

 

9. ఆ పనేదో మీరూ చేస్తే బాగుంటుందేమో కదా..మంచిగా!

 

వాళ్ళ మాట   

 

10. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని అన్నవారు. అలాంటి వారి విగ్రహాలు...  

 

ప్రజల తూటా

 

10. వాళ్ళంటే అంత గౌరవం ఉన్నవాల్లయితే రాష్ట్రాన్ని విడగొట్టి ఉండేవారు కాదు.

 

వాళ్ళ మాట  

 

11. డిగ్గీ సింగ్...ఇప్పుడు మడమ తిప్పే ప్రసక్తే లేదు.

 

ప్రజల తూటా

 

11.అదే మేము అంటున్నాం.