Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గద్దర్ అవార్డులపై స్పందనేదీ.. టాలీవుడ్ పై రేవంత్ అసంతృప్తి!
posted on: Jul 30, 2024 2:46PM
తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రముఖ తమిళరచయత, ఉద్యమకారుడు శివశంకరికి విశ్వంభర డాక్టర్ సి. నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కార ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా ప్రసంగిస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగానే ఉన్నప్పటికీ పరిశ్రమ నుంచి మాత్రం సరైన స్పందన కరవైందని అన్నారు.
సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉన్నదన్న దానితో సంబంధం లేకుండా చిత్రపరిశ్రమ, ప్రభుత్వం మధ్య మంచి అనుబంధమే ఉంటుంది. రాష్ట్రంలో ఏదైనా విప్తు సంభవించినపుడు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు స్పందిస్తారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినపుడు సంబంధిత శాఖ కూడా సానుకూలంగానే స్పందించి ఆ సమస్య పరిష్కారంలో సహకారం అందిస్తుంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగానే ఉంది.
అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ రేవంత్ రెడ్డి అసంతృప్తికి కారణమేమిటంటే.. ప్రతిష్ఠాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డులతో భర్తీ చెయ్యాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని, గద్దర్ అవార్డులపై అభిప్రాయాలను తెలియజేయాలని ముఖ్యమంత్రి చిత్ర పరిశ్రమను కోరారు. అయితే అం దుకు పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేదు.
దీంతో రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందన లేకపోవడం సరికాదని ఆయన అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించామని, దీనిపై సినీ పరిశ్రమలోని పెద్దలు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.


.webp)
.webp)


