మరో యాగానికి కేసీఆర్ శ్రీకారం

posted on: Dec 29, 2018 10:26AM

 

కేసీఆర్ పేరు వింటే సీఎం అని ఎలా గుర్తుకువస్తారో.. పూజలు, ముహుర్తాలు, యాగాలు కూడా అలాగే గుర్తుకు వస్తాయి. పార్టీ పరంగా లేదా ప్రభుత్వ పరంగా ఇలా కార్యక్రమాన్ని మొదలుపెట్టాలన్న ఆయన ముహూర్తం చూసుకుంటారు. అలాగే ఆయన యాగాలు కూడా నిర్వహిస్తారు. ఎన్నికల్లో గెలుపు, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా నెలరోజులు క్రితం రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన కేసీఆర్‌.. మరో యాగాన్ని తలపెట్టారు. రాష్ట్రాభివృద్ధి, లోకకల్యాణం నిమిత్తం ఆయన మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగం చేయనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి సమీపంలో ఉన్న తన వ్యవసాయక్షేత్రంలో జనవరి 21 నుంచి 25 దాకా ఈ మహాయాగాన్ని నిర్వహించనున్నారు. మూడేళ్ల క్రితం వైభవోపేతంగా నిర్వహించిన అయుత చండీ మహాయాగం మాదిరిగానే.. ఈసారి కూడా శృంగేరీ జగద్గురువులు భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో, శృంగేరీ శారదాపీఠం సంప్రదాయంలోనే ఈ మహాయాగాన్ని నిర్వహించనున్నారు. ఈ యాగానికి వివిధ ప్రాంతాల నుంచి స్వామీజీలను, పీఠాధిపతులను, ధర్మాచార్యులను, ఆధ్యాత్మిక, ధార్మికవేత్తలను, వేదపండితులను, ప్రముఖులను కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...