ఎన్టీఆర్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన టీ.టీడీపీ ఎమ్మెల్యేలు
Published on: Wed Nov 5, 2014 9:44AM

శాసనసభ సమావేశాల సందర్భంగా టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌ఘాట్ వద్ద నివాళులర్పించి సమావేశాలకు బయలుదేరారు. అలాగే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం సమావేశాలకు హాజరైయ్యేందుకు వీరంతా అసెంబ్లీకి బయలుదేరారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. బీజేపీ ఎమ్మెల్యేలు బషీర్‌బాగ్ ఫ్లె ఓవర్ నుంచి కాలినడకన అసెంబ్లీకి బయలుదేరారు.


