ఏకపక్ష తీరు నడవదు
Published on: Wed Nov 5, 2014 10:05AM

మెజారిటీ ఉంది కదా అని శాసనసభలో ఏకపక్షంగా వ్యవహరిస్తే ఊరుకోబోమంటున్నారు తెలంగాణ ప్రతిపక్షాలు. సభలో తమ గొంతు నొక్కే పరిస్థితిని ఒప్పుకునేది లేదంటున్నారు. ప్రజా సమస్యలను వినిపించే సమయాన్ని తమకు ఇవ్వాల్సిందిగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి లాంటి నేతలైతే... ఒకవేళ సర్కారు ఓవరాక్షన్ చేస్తే సహించేది లేదని తేల్చిచెబుతున్నారు. సభా సమయాన్ని వేస్ట్ చేసి.... వాయిదాలతో కాలం గడుపుదామంటే దీటైన సమాధానం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని సర్కారుకు గట్టిగానే చెప్పారు ప్రతిపక్ష పార్టీల నేతలు.


