నిరుద్యోగ ఐకాస నాయకుల ర్యాలీ

posted on: Mar 18, 2015 12:35PM

 

ఎన్నికల్లో గెలవడానికీ, అధికారం రావడానికీ మన నాయకులు ఒకరికొకరు పోటీ పడి మరీ ఆవేశంగా ఎన్నో హామీలు ఇస్తుంటారు. అధికారం వచ్చిందా ఇక హామీల సంగతి దేవుడెరుగు అన్నట్లు ఉంటారు. అలా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లక్ష ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే ప్రకటన విడుదల చేయాలని నిరుద్యోగ ఐకాస నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల నుండి తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీని అడ్డుకునేందుకు ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...